ఇదీచదవండి.పాఠశాలల్లో అధిక ఫీజు వసూలుపై అధికారుల చర్యలు
జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి : రాజేంద్ర ప్రసాద్ - MLC RAJENDRA PRASAD
విజయనగరం జిల్లా భోగాపురంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పర్యటించారు. రాజధాని పేరుతో విశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సీఎం పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి: రాజేంద్ర ప్రసాద్
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోతుందని ఎమ్మెల్సీ వై.బి. రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గురువారం భోగాపురం మండలానికి వచ్చిన ఆయన.. రాజధాని పేరుతో విశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఇందులో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఇప్పటికే విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో విశాఖలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినందున విశాఖను పాలనా రాజధానిగా మారుస్తున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి.పాఠశాలల్లో అధిక ఫీజు వసూలుపై అధికారుల చర్యలు
TAGGED:
MLC RAJENDRA PRASAD