ETV Bharat / state

రాహుల్ వస్తేనే... ఏపీ బాగుపడుతుంది: రఘువీరా రెడ్డి

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... ప్రజల ఆలోచనలకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రంలోని యువత భవిష్యత్తును బాగు చేస్తామన్నారు.

author img

By

Published : Apr 2, 2019, 7:30 PM IST

రఘువీరా రెడ్డి
రఘువీరా రెడ్డి
విజయనగరంజిల్లా నెల్లిమర్లలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లిమర్ల శాసనసభ అభ్యర్థి రమేష్ కుమార్, విజయనగరం ఎంపీ అభ్యర్థి యడ్ల ఆదిరాజు తరఫున ఓట్లు అభ్యర్థించారు. దేశప్రజలు మార్పు కోరుకుంటున్నారని... ప్రజల ఆలోచనలకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని రఘువీరా అన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో 6శాతం నిధులు విద్యకు కేటాయించడానికి రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నెలకు ఆరువేల రూపాయలు పేదవారికి ఇస్తామని హామీ ఇచ్చారు.ప్రత్యేక హోదాతో రాష్ట్రంలోని యువత భవిష్యత్తును బాగు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని... ఇందుకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

రెండు పండగలకు.. రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితం -బాబు

spot(). 02.04.2019 Ap_cdp_51_02_YS_AVINASH_ROAD_SHOW_avb_C8 REPORTER: MARUTHIPRASAD CENTER : PULiVENDULA కడప జిల్లా .... కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల్లో ని ఆర్టీసీ బస్టాండు నుండి పూల అంగళ్ల సర్కిల్ వరకు రోడ్డు షో నిర్వహించారు... పాతబస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ .2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం అయిన తరువాత రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని చంద్రబాబు నాయుడు ఎక్కడే కాని తన పరిపాలన చూసి ఓటు వేయండని అడగడం లేదని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఎల్లో మీడియాను నమ్ముకున్నారని అన్నారు.రాజశేఖరరెడ్డి గండికోట నుంచి చిత్రావతికి లిఫ్టిరిగేషన్ ఆ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేశారని..... ఆ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ జలయజ్ఞం కాదు... ధన యజ్ఞమని తెలుగుదేశం నాయకులు విమర్శించారు.... కానీ ఇప్పుడు నీళ్ళు వచ్చేసరికి ఈ తెలుగుదేశం నాయకులు అంతా మేమే చేశామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని అన్నారు.ఫీల్డ్ కెనాల్స్ మైక్రో ఇరిగేషన్ పనులు ఐజీ కార్ల్, ఇండోర్ స్టేడియం, ఇవన్నీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం పట్టించుకోలేదని.... వైయస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కడప పులివెందుల రోడ్డు పులివెందులకు రింగ్ రోడ్డు ముదిగుబ్బ పులివెందుల రోడ్డు ఇలా అనేక అనేక విధంగా పులివెందుల ను అభివృద్ధి చేశారని వైఎస్ జగన్ సీఎం అయితే పులివెందులలో పూర్తిగా నిరుద్యోగ సమస్య తీరుతుందని డాక్రా మహిళలకు నాలుగు విడతల్లో రుణాలు మాఫీ చేస్తామని అన్నారు .ఆదినారాయణరెడ్డిని సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని అధికారం కోసం డబ్బు కోసం పదవి కోసం పదవిని అమ్ముకున్న వ్యక్తి ఆదినారాయణ రెడ్డి ని ఒకవైపు ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తి నేను ఎవరు కావాలో మీరే ఆలోచించుకోవాలని అన్నారు.వైస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు వర్షాలు బాగా పడేవని కానీ ఈ చంద్రబాబు పాలనలో ఒక్క వర్షం కూడా సరిగా పడలేదని అన్నారు.జగనన్న సీఎం అయితే మైక్రో ఇరిగేషన్ పనులు ఫీల్డ్ కెనాల్స్ అన్ని పనులు పూర్తవుతాయని అన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.