విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో శ్రీనివాస్ కోడి పిల్లల పరిశ్రమలో ఒక యూనిట్ మూసివేయటంతో కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని నినదించారు. పరిశ్రమలో ఒక యూనిట్లో ఉన్న 22 మందిని విధులకు రావద్దని చెప్పటం దారుణమని సీఐటీయూ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ విమర్శించారు. వారికి ఇవ్వాల్సిన పీఎఫ్, బకాయిలను చెల్లించాలని.. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి ప్రకటన లేకుండా సిబ్బందిని తొలగించటం అన్యాయమని.. దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నర్సింగ్‌రావు, సుందరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
కోడి పరిశ్రమ కార్మికులను ఆదుకోవాలని నిరసన
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అర్ధాంతరంగా కోడి పిల్లల పరిశ్రమలను మూసివేయటంతో కార్మికులు ఆందోళనకు దిగారు.