హైదరాబాద్ నుంచి కోల్కతాకు కాలినడకన పయనమైన వలసకూలీలు విజయనగరం జిల్లా భోగాపురం చేరుకున్నారు. సుందరపేట సమీప రహదారిలో ప్రయాణిస్తున్న సమయంలో రమేష్ యాదవ్ అనే వలస కూలీ అస్వస్థతకు గురై రోడ్డు మీద పడిపోయాడు.
విషయం తెలుసుకున్న స్థానిక సామాజిక ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ.. బాధితునికి చికిత్స చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. గత వారం రోజులుగా తాము నడుస్తున్నామని చెప్పడం.. వారి నిస్సహాయతను తెలియజేస్తోంది.
ఇదీ చదవండి: