విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పల్లపుదుంగాడ గిరిజన గ్రామంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్బిణులకు అవస్థలు తప్పటం లేదు. గ్రామానికి చెందిన సుమిత్ర అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా... భర్త సన్యాసిరావు, బంధువులు కలసి డోలీతో 12కిలోమీటర్ల దూరం మోసుకుంటూ దబ్బగుంట వరకు వచ్చారు. అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ ద్వారా ఎస్. కోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. రహదారి లేకపోవడం వల్లే గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని సన్యాసిరావు వాపోతున్నారు.
ఇదీ చదవండి: గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగానే ప్రసవం