ETV Bharat / state

Ferro Industries Shutdown: ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్​ షాక్​.. బెంగతో కుంగిపోతున్న కార్మికులు.. - Ferro industries shut down increased power charges

Power Shock to Ferro Alloys Industries: వైఎస్సార్​సీపీ సర్కార్‌ భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలు కట్టలేక వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు వెన్నుదన్నుగా నిలిచిన ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు లేఆఫ్‌ ప్రకటిస్తున్నాయి. దీంతో వాటిపైనే ఆధారపడిన వేల కుటుంబాలు బతుకు బెంగతో కుంగిపోతున్నాయి. తమ కార్మికుల జీవితాలను దృష్టిలో ఉంచుకునైనా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

ferro alloys industries
ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు
author img

By

Published : Jul 16, 2023, 8:56 AM IST

Updated : Jul 17, 2023, 11:38 AM IST

Power Shock to Ferro Alloys Industries: వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు వెన్నుదన్నుగా నిలిచిన..ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు.. వైఎస్సార్​సీపీ సర్కార్‌ విద్యుత్‌ బాదుడుకు మూతపడుతున్నాయి. వేలాది కుటుంబాలకు ఆసరాగా నిలచిన పరిశ్రమలు లేఆఫ్‌ ప్రకటిస్తున్నాయి. ముడిసరకు ధరలు పెరిగినా, మార్కెట్ ఒడిదొడుకులు వచ్చినా తట్టుకుని నిలబడిన యాజమాన్యాలు.. భారీగా పెంచిన కరెంటు ఛార్జీలు కట్టలేక తాళాలు వేస్తున్నారు. వాటిపై ఆధారపడిన వేల కుటుంబాలు.. బతుకు బెంగతో కుంగిపోతున్నాయి.

Ferro Alloy Industries: ప్రభుత్వ స్పందన కరవు.. మూసివేతకు సిద్ధమైన 39 ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలు

విజయనగరం జిల్లాలో.. గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బొబ్బిలి, కొత్తవలస ప్రాంతాల్లో 17 ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలున్నాయి. సుమారు 10వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి. పరోక్షంగా మరో 20 వేల మంది వీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. మార్కెట్‌ ఒడిదొడుకులు, ముడిసరుకుల ధరలతోనే అల్లాడుతున్న ఫెర్రో ఎల్లాయిస్ సంస్థలపై.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బాంబ్‌ వేసింది. అది భరించలేక.. బొబ్బిలిలోని ఇంపెక్స్‌, చింతలపాలెంలో మెసర్స్‌ డెక్కన్‌ ఫెర్రో సంస్థలు మూతపడ్డాయి. గరివిడిలోని ఫేకర్‌, గర్భాంలో స్మెల్ టెక్‌ ఫెర్రో సంస్థలు కూడా లేఆఫ్‌ ప్రకటించాయి. మరికొన్ని పరిశ్రమలూ అదే బాటలోఉన్నాయి.

ఇలా అయితే, పరిశ్రమలు మూతపడతాయ్! ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమల యజమానులు ఆందోళన!

132 కేవీ పరిధిలోని ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలకు.. యూనిట్ విద్యుత్ ధరను 5 రూపాయల నుంచి.. 8 రూపాయల 59పైసలకు పెంచేసింది. ఇక 33 కేవీ పరిధిలో 5 రూపాయల 40 పైసల నుంచి 8రూపాయల 99 పైసలకు పెంచింది. అదే సమయంలో .. ఫెర్రో మాంగనీస్ ధర టన్ను 78 వేల నుంచి 69వేల రూపాయలకు పడిపోయింది. ఫెర్రో క్రోమ్ లోహం.. టన్ను తయారీకి లక్షా 24 వేల వ్యయం అవుతుండగా.. మార్కెట్లో లక్షా 10వేల రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది.

ఈ సమయంలో చేయూతనివ్వాల్సిన వైఎస్సార్​సీపీ సర్కార్‌.. విద్యుత్‌ షాక్ ఇచ్చిందంటూ పరిశ్రమల యాజమాన్యాలు గగ్గోలుపెడుతున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమల యాజమాన్యాలు లేఆఫ్​లను ప్రకటిస్తున్నాయి. దీంతో వీటిపైనే ఆధారపడిన కార్మికులు కుటుంబాలు బెంగతో కుంగిపోతున్నాయి. వేల మంది కార్మికుల జీవితాలను దృష్టిలో ఉంచుకునైనా.. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విద్యుత్ రాయితీలు కల్పించి.. పరిశ్రమలను ఆదుకోవాలని ఫెర్రో ఎల్లాయిస్ సంస్థల యాజమాన్యాలు వేడుకుంటున్నాయి.

Ferro Alloys Company Closed: మూతపడిన మరో ఫెర్రో ఎల్లాయ్స్​ పరిశ్రమ.. రోడ్డున పడ్డ వందలాది కార్మికులు

"ఈ పరిశ్రమలు లేఆఫ్​లను ప్రకటించటం వల్ల మా కార్మికులం అంతా రోడ్డున పడతాము. మేము దీనిపైనే ఆధారపడి మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. మాకు జీవనాధారమైన ఈ పరిశ్రమలు మూతపడితే మేము ఎలా జీవనం సాగించాలో తెలియని పరిస్థితుల్లో కుంగిపోతున్నాము. మా కార్మికులను దృష్టిలో ఉంచుకునైనా.. సర్కారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతున్నాము. విద్యుత్ రాయితీలను కల్పించి పరిశ్రమలు మూతపడకుండా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నాము." - కార్మికుల ఆవేదన

ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్​ షాక్

Last Updated : Jul 17, 2023, 11:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.