విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల పూరిళ్లు నేలకొరిగాయి. ప్రధానంగా జియ్యమ్మవలస మండలం తురక నాయుడు వలస గ్రామంలో గాలుల ఉద్ధృతికి చెట్టుకొమ్మలు, ఇంటిపైకప్పుల రేకులు ఎగిరిపడ్డాయి. ఓ ఇంట్లో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అరటి తోటల్లో చెట్లు నేలకూలాయి. అధికారులు స్పందించి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :