విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి బి పాజిటివ్ ప్లాస్మా ఇచ్చి ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్ మల్లేశ్వరరావు. విజయనగరం జిల్లా చినమేరంగిలో కానిస్టేబుల్‌గా మల్లేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన చేసిన సాయం గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి.. మల్లేశ్వరరావును తన కార్యాలయానికి పిలిచి అభినందించి, సత్కరించి.. ప్రోత్సాహక నగదు, జ్ఞాపికను అందజేశారు.
మల్లేశ్వరరావును స్ఫూర్తిగా తీసుకొని, మరికొంత మంది ప్లాస్మాను దానం చేయాలని పోలీసులు, యువతను ఎస్పీ కోరారు. ప్లాస్మాను దానం చేసేందుకు ఆసక్తి కలిగిన వారు పోలీసు వాట్సాప్ నంబరు 6309898989 లేదా డయల్ 100కు ఫోను చేసి, తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ పి. వీరాంజనేయరెడ్డి, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్పీ సిఐ, డిసిఆర్బి సిఐలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కుళ్లిన కోడిగుడ్లు పూడ్చివేతపై విచారణకు కలెక్టర్ ఆదేశం