విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో నాటుసారా తయారు చేస్తుండగా.. ఎస్.ఐ సంతోష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక్కడ రూ.15 వేలు విలువైన 50 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి... రిమాండ్కు తరలించారు. చీడికాడ మండలం దిబ్బపాలెంలో నాటుసారా తయారీ స్థావరంపై మాడుగుల ఆబ్కారీ శాఖ సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. 1400 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి... పారబోశారు.
విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం శామయ్యావలస, ఏం. పాలెం గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2వేల 500 లీటర్ల బెల్లంఊటను పోలీసులు ధ్వంసం చేశారు. రాయవలస పోలీస్ స్టేషన్ ఎస్సై రవి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
భారీగా గంజాయి స్వాధీనం
పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. లారీలో అక్రమంగా తరలిస్తున్న 1,837 కిలోల గంజాయిని విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విశాఖ మన్యం చింతపల్లి - రంపుల రహదారి మార్గంలో మంగళవారం తెల్లవారుజామున తరలిస్తుండగా...కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు స్మారక మందిరం వద్ద వాహన తనిఖీల్లో భాగంగా పట్టుకున్నట్లు కృష్ణదేవిపేట ఎస్ఐ పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులు పరారయ్యారని... వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నమని ఎస్సై పైడ్రాజు తెలిపారు.
ఇదీ చదవండి: