విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర గ్రామానికి చెందిన చప్పాల పైడితల్లి (47) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మిర్తివలస గిరిజన గ్రామానికి చెందిన పొయిరి రామచంద్ర పైడితల్లికి ఆవు విక్రయించాడు. ఈ సమయంలో తన భార్యతో పైడితల్లి అసభ్యంగా ప్రవర్తించడం వల్లే కాపు కాసి హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. ఈ మేరకు వీఆర్వో వద్ద ముద్దాయి లొంగిపోయాడు. వీఆర్వో ఇచ్చిన సమాచారంతో ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు గజపతి నగరం సీఐ రమేశ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి...