ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయనగరం, పీఎస్ఆర్ కాలనీలో... జిల్లా కలెక్టర్‌తో కలిసి స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మొక్కలు నాటారు. పట్టణంలో బాబామెట్ట హజరత్ ఖాదర్ వాలి బాబా దర్గా వద్ద ఏ.టి.కే. ఆధ్యాత్మిక సేవా సంఘం, రోటరీ క్లబ్ విజయనగరం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం కాలనీ వాసులకు ఎమ్మెల్యే మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిజవాహర్ లాల్, ఏ.టి.కే. ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్థాపకుడు ఖలీల్ బాబు, డా.వెంకటేశ్వర రావు, వైకాపా నాయకులు మారాజు శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి గోదావరి బేసిన్లో ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టలేదన్న తెలంగాణ