విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణ మధ్యలోంచి ప్రవహించే వరహాల గెడ్డ ప్రాంతాన్ని.. వరద నీరు ముంచేసింది. భారీ వర్షానికి వరహాలు గెడ్డ పొంగి... కాలనీలోకి విపరైతమైన వరద చేరింది. ఫలితంగా.. రాకపోకలకు అంతరాయం కలిగింది. స్థానికులు అవస్థలుపడ్డారు. పురపాలక కమిషనర్ ప్రసాదరావు పరిస్థితిని పరిశీలించారు. నీరు పోయేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అక్కడే ఉన్న వసతి గృహం చుట్టూ వరద నీరు చేరడాన్ని గుర్తించిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇదీచూడండి