విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో గల ఆధార్ కేంద్రాల్లో... ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం జారీచేసిన పథకాల లబ్ధి కొరకు పిల్లల ఆధార్ నమోదులో వేలిముద్రలు కోసం మీ సేవ కేంద్రాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్నారు. రోజూ ఆధార్ కేంద్రంకు వెళ్తున్న కారణంగా... పిల్లలు పాఠశాలకు వెళ్లట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతోందని వాపోయారు.
ఇదీచూడండి