ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తామని కేంద్రం చెప్తుంటే వాళ్లకే మద్దతు ఇస్తున్న పరిస్థితి మన ప్రభుత్వానిదని పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా ఎక్కడ ఎలా దోపిడీ చేయాలో ఆలోచనలు చేస్తున్నారన్నారు. మద్దతు ధర లేకపోవడం, నిత్యవసర ధరలు పెరిగిపోవడం చూస్తుంటే ఇదేనా అభివృద్ధి అని అనిపిస్తుందన్నారు. దళితులపైన, కార్మికులపైన దాడులు జరిగినా వైకాపా ప్రభుత్వం స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అచ్చెన్న అరెస్ట్ విషయంలో నిజాలు వెల్లడించాలి'
చింతపల్లి ప్రాంతంలో ఉన్న బాక్సైట్ దోపిడీకి గురి అవుతుంటే.. ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు మాట్లాడటం లేదని శైలజానాథ్ మండిపడ్డారు. తెదేపా నాయకులపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన ఆగ్రహించారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వైకాపా... భాజపా వైపు నిలబడుతుందా...భారత రాజ్యాంగం వైపు నిలబడుతుందా అన్నది చెప్పాలన్నారు.
ఉత్తరాంధ్రపై వైకాపా నేతల కన్ను పడిందని అందుకే.. ప్రేమ నటిస్తున్నారన్నారని ఎస్.కోట పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు సమావేశంలో శైలజానాథ్ ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: