విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెదేపా నేతలు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇతర తెదేపా నేతలంతా కలిసి వారికి వస్తువులు అందజేశారు. క్లిష్ట సమయంలో కార్మికులు అందిస్తున్న సేవలను నేతలు కొనియాడారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: