ETV Bharat / state

Aadivasi Festival: ఆదివాసీ ఉత్సవాలు ప్రారంభం.. గిరిజనులతో కలిసి ఆడిన పీవో - parvathipuram itda

విజయనగరం జిల్లాలో ఆదివాసీ ఉత్సవాలను ఐటీడీఏ పీవో కూర్మనాథ్ ఘనంగా ప్రారంభించారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద ఉన్న అడవి తల్లి విగ్రహానికి పీఓ కూర్మనాథ్, గిరిజన సంఘం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి తల్లిని ఆహ్వానించే కార్యక్రమం సందడిగా సాగింది.

ఆదివాసి ఉత్సవాలు
ఆదివాసి ఉత్సవాలు
author img

By

Published : Aug 8, 2021, 6:43 PM IST

ఆదివాసి ఉత్సవాలు ప్రారంభం.. గిరిజనులతో కలిసి ఆడిన పీవో

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీ ఉత్సవాలను పీవో కూర్మనాథ్ ప్రారంభించారు. తమ సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో గిరిజన పెద్దలు పీవోను వేడుక వద్దకు తీసుకెళ్లారు. అడవి తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. పీవో దంపతులు అడవి తల్లికి చీర, గాజులు సమర్పించి.. పాలాభిషేకం చేశారు. పట్టువస్త్రాలతో అలంకరించారు.

ఆదివాసీ దినోత్సవం ముందు రోజు అడవి తల్లికి ఆహ్వానం పలకడం ఆనవాయితీగా వస్తోందని పెద్దలు తెలిపారు. పూజల తర్వాత గిరిజనులతో కలిసి పీవో థింసా నృత్యం చేశారు. డప్పు కొట్టారు. ఉద్యోగులను, గిరిజనులను ఉత్సాహపరిచారు. డీఎస్పీ సుభాష్ అడవి తల్లికి పాలాభిషేకం చేశారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.

ఇదీ చదవండి:

విశాఖలో అమానవీయం.. బతికుండగానే శిశువును ఖననం చేసేందుకు యత్నం

'నవ్వుల టానిక్'తో.. అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతున్న డాక్టర్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.