విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొండతాడూరు, తోకమెట్ట, మెట్టవలస, వేటగానివలస తదితర గ్రామాల్లో కుడుమూరు భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన దీక్ష చేపట్టారు. రెవెన్యూ సర్వే నెం 48లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు.
కోడుమూరు రెవెన్యూ డివిజన్లో సుమారు 10 గ్రామాల గిరిజన రైతులు సాగు చేస్తున్నారని.. వారికి హక్కులు లేకపోవటం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులను పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా.. సమస్య పరిష్కారం చేయటం లేదని అన్నారు. భూమికి సంబంధం లేని గిరిజనేతరులు వచ్చి బెదిరింపులుకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: