రాయితీ ఉల్లి కోసం సామాన్యులు నానా పాట్లు పడుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట రైతు బజార్‌లో రాయితీ ఉల్లిపాయల పంపిణీ గందరగోళంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే మహిళలు క్యూలో ఉండగా... 9 గంటలకు పంపిణీ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి జనం రెట్టింపయ్యి తోపులాట జరిగింది. వారిని నియంత్రించలేక అధికారులు ఉల్లి పంపిణీ నిలిపివేశారు. జనం ముందుకు తోసుకొచ్చి కొందరు మహిళలు కిందపడ్డారు. పోలీసులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఉల్లి నిల్వ తక్కువగా ఉందని.. అందరికీ పంపిణీ చేయలేమని అధికారులు చెప్పగా... మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఇవీ చదవండి..