విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం పోతనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రసాద్ అనే వ్యక్తి పశువులను కాయటానికి స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రసాద్ ను రక్షించి బయటకి తీసుకువచ్చారు. ఈ ప్రయత్నంలో సత్తిబాబు అనే వ్యక్తి చెరువులో మునిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్తిబాబును ఎస్ కోట ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: