విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రపేట పంచాయతీ గ్రామమైన తోటపల్లిలో విద్యుత్ తీగ తెగి.. ఓ వ్యక్తి మరణించాడు. గ్రామానికి చెందిన పంచదార్ల తాత తెల్లవారుజామున 3 గంటలకు రామచంద్రపేటకు సమీపంలో ఉన్న ఏటి నుంచి ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్లాడు. పంచదార్ల తాతతో పాటు గ్రామానికి చెందిన అప్పన్న, ఇసుక ఎడ్ల బండిలో లోడ్ చేసుకొని తిరుగుపయనమయ్యారు. గ్రామానికి సమీపంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగ ఎద్దు కొమ్ముకు తగలటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బండి ముందుకు వంగటంతో పంచదార్ల తాత చేతికి విద్యుత్ తీగ తగిలి, అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక వస్తున్న అప్పన్న ఈ విషయాన్ని గమనించి, గ్రామస్థులకు సమాచారం అందించారు. మృతుడు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
ఇదీ చదవండి: విజయనగరం తెదేపాలో వర్గ పోరు