ETV Bharat / state

కొఠియా గ్రామాల్లో ఒడిశా బియ్యం

సాలూరు మండలంలోని కొఠియా గ్రామాలపై పట్టు కోసం ఒడిశా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా.. నేరేళ్ల వలసలో ఒడిశా రైస్ సెంటర్​ను ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ప్రీతంపాడి ప్రారంభించారు.

Odisha rice in Kothia villages
కొఠియా గ్రామాల్లో ఒడిశా బియ్యం
author img

By

Published : Mar 16, 2021, 7:43 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా గ్రూపు గ్రామాలపై పట్టు కోసం ఒడిశా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. సాలూరు మండలం మైదాన ప్రాంతం నేరెళ్ల వలసలో ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ప్రీతం పాడి సోమవారం ఒడిశా రైస్ సెంటర్​ను ప్రారంభించారు. నేరెళ్లవలస, జాకర వలస, కుంభిమడ, దొరల తాడివలస, మూల తాడివలస, దూల భద్ర చెందిన వివాదాస్పద గ్రామాల గిరిజనులకు ఈ కేంద్రంలో ఇక నుంచి ప్రతి నెలా ఒడిశా బియ్యం అందించనున్నారు. ఈ కేంద్రంలో 298 మంది కార్డుదారులకు ప్రతి నెల 15 కిలోల బియ్యం అందించనున్నారు.

కొఠియా వివాదాస్పద గ్రామాల అభివృద్ధికి ఒడిశా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే ప్రీతంపాడి చెప్పారు. నేరెళ్లవలసలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన భవనం పక్కనే హూటాహుటిన పక్కా భవనం నిర్మించి రేషన్ సబ్ సెంటర్​ను ప్రారంభించడం ఒడిశా దూకుడుకు పరాకాష్ట. ఈ గ్రామానికి సమీపంలో ఒడిశా 67 లక్షలతో వసతి గృహం నిర్మిస్తోంది.

ఇదీ చదవండి:

కర్రల వంతెన...తీరింది యాతన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.