మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లాలో తెదేపా నాయకులు నివాళులర్పించారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, జిల్లా ఇంచార్జ్ అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కోట జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అశోకగజపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఎందరో ప్రముఖులు నడయాడిన నేల విజయనగరమని అశోక్ గజపతిరాజు కొనియాడారు.
చీపురుపల్లిలో..
మాజీ ఎమ్మెల్యే భాజపా నాయకులు గద్దె బాబురావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచమే గర్వించదగ్గ తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని గద్దె బాబూరావు కొనియాడారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదంతో పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలు రూపొందించారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాకు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆయన.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గరివిడిలో..
గరివిడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదాన శిబిరం కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు పట్టణంలో..
సాలూరు పట్టణంలోని వెంకటేశ్వర కూడలి వద్ద ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే భంజు దేవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనాల హృదయాల్లో నిలిచిపోయే కృష్ణుడు, రాముడు, కర్ణుడు ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
ఇవీ చూడండి: