దైవ ప్రతిమ ధ్వంసానికి గురైన రామతీర్థానికి రోజుల వ్యవధిలోనే కొత్త విగ్రహాలు చేరుకున్నాయి. తితిదే శిల్ప తయారీ కేంద్రంలో చేయి తిరిగిన శిల్పులు కృష్ణశిలతో సరికొత్త విగ్రహాలు తీర్చిదిద్దారు. పీఠంతో పాటు మూడడుగుల ఎత్తులో విగ్రహాలు రూపొందించారు. పోలీసు భద్రత మధ్య ప్రత్యేక కంటైనర్‌లో దేవాదాయశాఖ అధికారులు విగ్రహాలను రామతీర్థానికి చేర్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య ఊరేగింపుతో కార్యక్రమం సాగింది.
రేపటి నుంచి 3 రోజుల పాటు విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, 28న ఆలయ కళ్యాణ మండపంలో ఉన్న బాలాలయంలో ప్రతిష్టించనున్నారు. ఆలయ నిర్మాణ పనులకు దేవాదాయశాఖ త్వరలోనే శంకుస్థాపన చేయనుంది. ప్రభుత్వం ఇప్పటికే 3 కోట్లు కేటాయించగా, రాతి ఆలయంతో పాటు మెట్ల మార్గం, హోమశాల, వంటశాలను కొత్తగా నిర్మించనున్నారు. ఆయా పనులు పూర్తయ్యాక కొత్త విగ్రహాలను తిరిగి ప్రధానాలయంలో ప్రతిష్టిస్తారు.
ఇదీ చదవండి: