Nara Lokesh Yuvagalam Padayatra Concluding Meeting: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తును జనం తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర, రాప్తాడు నుంచి పార్టీ శ్రేణులు వస్తున్నారు.
ఇప్పటికే విజయోత్సవ సభకు 5 ప్రత్యేక రైళ్లు వేయగా, తాజాగా సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి ప్రత్యేక రైలు విజయనగరానికి బయలుదేరింది. ఈ సందర్బంగా సత్యసాయి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రైలులో ఉత్సాహంగా బయలుదేరారు. రైలు బయలుదేరుతున్న సమయంలో సైతం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టి రైలు ఎక్కారు. జై చంద్రబాబు, జై లోకేశ్ నినాదాలతో రైలు మార్మోగింది.
పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా - విశాఖలో ముగిసిన నారా లోకేశ్ యువగళం
యువగళం పాదయాత్ర ముందు నుంచి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రజల కష్టాలను నష్టాలను తెలుసుకున్నారని తెలుగుదేశం శ్రేణులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, యువగళం భారీ ప్రజాదళంతో ముగింపు సభను ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీ గెలుపునకు శంఖారావంగా ఈ సభ ఉంటుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అభిమానంతో తరలి వచ్చే జన సునామీని ఎవ్వరూ ఆపలేరని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులను సైతం రాకుండా చేయడంపై మండిపడుతున్నారు. చివరికి ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లను కూడా భయపెడుతున్నారని విమర్శించారు. మరో మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం దిగిపోతుందని అన్నారు. అధికార అహంతో విర్రవీగే ప్రభుత్వ కుట్రల్ని ఛేదిస్తామని తేల్చిచెప్పారు. ఏది ఏమైనా తెలుగుదేశం - జనసేన శ్రేణులు కాలినడన సైతం కదంతొక్కుతూ యువగళం విజయోత్సవ సభకు తరలివస్తారని టీడీపీ నేతలు తెలిపారు.
యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి - తరలివస్తోన్న అశేష జనం
Yuvagalam Success Meeting Arrangements: కాగా ఇప్పటికే యువగళం పాదయాత్ర విజయోత్సవ జైత్రయాత్ర సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద సభ జరగనుంది. యువగళం విజయోత్సవ సభలో 6 లక్షలు మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి 5 రైళ్లు బయలు దేరనున్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, ఇతర వాహనాల్లో అశేష జనం హాజరుకానున్నారు. ఈ విజయోత్సవ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనుంది.
యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభను విఫలం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు