ETV Bharat / state

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి ఓదార్పు - Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari Restarted Nijam Gelavali Yatra: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో మరోసారి యాత్ర చేపట్టారు. ఈరోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించి బాధిత కుటుంబాలకు రూ. 3లక్షల చెక్కు అందించారు. రేపు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, 5వ తేదీన విశాఖ జిల్లాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు.

Nara_Bhuvaneshwari_Restarted_Nijam_Gelavali_Yatra_in_Vijayanagaram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2024, 6:18 PM IST

Updated : Jan 3, 2024, 10:54 PM IST

Nara Bhuvaneshwari Restarted Nijam Gelavali Yatra in Vijayanagaram: చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మనస్థాపంతో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర ఈరోజు పునః ప్రారంభించారు. విజయనగరంలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన అప్పారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య , కుమారుడితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 3లక్షల ఆర్థికసాయం అందించి, టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

నిజం గెలవాలి యాత్రను పునః ప్రారంభించిన భువనేశ్వరి

అనంతరం విజయనగరం నుంచి తెర్లాం వెళ్లారు. పెరుమాళి గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని, మృతుడు మైలపిల్లి పైడియ్య కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ఆ తర్వాత తెర్లాం మండలం చీకటిపేటకు చెందిన టీడీపీ అభిమాని, మృతుడు గుల్లిపల్లి అప్పారావు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరార్శించారు. తెర్లాం మండలం చీకటిపేట పర్యటన ముగించుకుని భువనేశ్వరి రాజాంలోని జి. ఎం. ఆర్ అతిధి గృహానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

జగన్​.. నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పు: 'నిజం గెలవాలి' యాత్రలో భువనేశ్వరి

Uttarandra Districts Nijam Gelavali Yatra: ఈవారం భువనేశ్వరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. ఈరోజు విజయనగరం జిల్లాలో బాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. రేపు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో, 5వ తేదీన విశాఖ జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు.

ఎన్టీఆర్ పౌరుషం.. చంద్రబాబు క్రమశిక్షణ నేర్చుకున్నాను! విజయవంతంగా భువనేశ్వరి రెండోరోజు 'నిజం గెలవాలి' యాత్ర..

Nijam Gelavali Yatra Should Conduct In Every Week: ప్రతి వారం బుధ, గురు, శుక్రవారాల్లో మూడు రోజుల పాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. దాదాపు 200 మంది చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో చనిపోయారని పార్టీ వర్గాలు సమాచారం సేకరించాయి. దీంతో వీరి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించేందుకు గతంలో ‘నిజం గెలవాలి’ పేరిట గతంలో శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కారణంగా మృతి చెందిన కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా కల్పిస్తారు.

'పార్టీ అండగా ఉంటుంది.. అధైర్యపడొద్దు'.. మృతుల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

చంద్రబాబు పర్యటనలు: ఈ నెల 5 నుంచి 29 వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని ఆ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. 'రా కదలిరా' పేరుతో బహిరంగ సభలు నిర్వహించనున్నారని తెలిపారు. మొదటి సభ ఒంగోలు నియోజకవర్గంలోని కనిగిరిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర పోస్టర్లను విడుదల చేశారు.

Last Updated : Jan 3, 2024, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.