విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి తన సొంత వాహనానికి మైక్ కట్టుకున్నారు. మైక్‌లో మాట్లాడుతూ కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విజయనగరంలోని ప్రధాన కూడళ్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పుకుంటూ తిరుగుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వాహనాలపై స్టిక్కర్లను చింపేశారు. అనవసరమైన కారణాలతో బయటకి వస్తే ఆ వాహనాలను సీజ్ చేయమని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. లాక్‌డౌన్ పాటించి కుటుంబాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: కరోనా పాజిటివ్ కేసులు: ఏయే జిల్లాలో ఎంతమంది..?