విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధరణ పరీక్షల కేంద్రంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ పరికరాలను ఎమ్మెల్యే జోగారావు ప్రారంభించారు. మారుమూల పల్లెలకు సైతం ఆధునిక వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాల సేవలను అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, పలువురు వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...