విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కోటి ఇరవై లక్షల రూపాయల నిధులతో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని మండలంలోనూ మౌలిక వసతుల కల్పనకు ఏడాది కాలంగా సుమారు 70 కోట్ల నిధులు వెచ్చించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, పీఎసీఎస్ ఆధ్యక్షులు గోవిందరావు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీచదవండి.