విజయనగరం జిల్లా పార్వతీపురంలో వంగపండు ప్రసాదరావు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్ప శ్రీవాణితో పాటు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పరామర్శించారు. వంగపండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వంగపండు మృతి ఉత్తరాంధ్రలోని పేద అట్టడుగువర్గాలకు తీరని లోటని ఉపముఖ్యమంత్రి ధర్మానకృష్ణప్రసాద్ అన్నారు. ఆయన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వంగపండు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తి వంగపండని పాముల పుష్ప శ్రీవాణి కొనియాడారు.
భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన పాట, మాట, ఆట ఈ పుడమి ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటాయని మంత్రి పేర్ని నాని అన్నారు. అట్టడుగు వర్గాల వారి సమస్యలను తన గొంతుతో వినిపించి పరిష్కారానికి తన వంత కృషి చేసిన విప్లవికవి వంగపండు అని మంత్రి కొడాలి నాని చెప్పారు.
ఇదీ చదవండి: