విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని సోమినాయుడు చెరువు సుందరీకరణలో భాగంగా నిర్మించిన మహా శివుని విగ్రహాన్ని మంత్రి పుష్ప శ్రీవాణి ఆవిష్కరించారు. కురుపాం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పుష్ప శ్రీవాణి అన్నారు.
అందులో భాగంగానే చినమేరంగి గ్రామాన్ని సమగ్ర స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించడం జరుగుతోందని చెప్పారు. గ్రామంలోని ఆలయాన్ని అభివృద్ధితోపాటుగా సోమినాయుడు చెరువును సుందరీకరించే పనులనూ చేపట్టామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు.
ఇదీ చదవండి: సేంద్రియ 'డ్రాగన్'కు భలే గిరాకీ