ETV Bharat / state

కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలి: బొత్స - కరోనా కేసులపై మంత్రి బొత్స కామెంట్స్

ఎవ‌రిలోనైనా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే, వెంట‌నే కొవిడ్‌ కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించి.. చికిత్స‌ అందించాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. జ్వ‌రం వ‌చ్చిన వెంట‌నే కేర్‌సెంట‌ర్‌కు త‌ర‌లించ‌డం ద్వారా, వారికి స‌త్వ‌ర‌మే చికిత్సను అందించ‌డంతోపాటుగా, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు.

minister botsa satyanarayana on covid care centers

author img

By

Published : May 8, 2021, 4:43 PM IST

విజయనగరం జిల్లా ఉన్న‌తాధికారులు, వైద్యారోగ్య‌ శాఖాధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ నిర్వ‌హించిన‌ టెలీ కాన్ఫ‌రెన్స్​లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పాల్గొన్నారు. కొవిడ్ నియంత్ర‌ణ‌కు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌.. మంత్రికి వివ‌రించారు. కొవిడ్ వ్యాధి ప‌ట్ల స్థానికంగా విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ సూచించారు. జిల్లాలోని అన్ని కొవిడ్ ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్‌, ఇత‌ర వ‌స‌తుల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. జ్వ‌రాల‌పై దృష్టి పెట్టి, వెంట‌నే వారికి చికిత్స‌ను అందించే ఏర్పాటు చేయాల‌న్నారు.

రెమ్​డెసివిర్‌, ఇత‌ర మందుల కొర‌త రాకుండా చూడాల‌న్నారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, పారిశుధ్యంపై దృష్టి పెట్టాల‌ని మంత్రి బొత్స అన్నారు. మృత‌దేహాల‌ను త్వ‌ర‌గా త‌ర‌లించాల‌ని, అవ‌స‌ర‌మైతే అద‌నంగా అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో సిబ్బందిని తీసుకోవాలన్నారు. ప్ర‌ైవేటు అంబులెన్సుల సేవ‌ల‌ను కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో క‌లిసి రెండు మూడు రోజుల్లో కొవిడ్‌పై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హిస్తామ‌న్నారు. దీనికి అధికారులంతా సిద్ధంగా ఉండాల‌ని మంత్రి కోరారు.

ఇదీ చదవండి:

కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.