ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై అనేక విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పథక డైరెక్టర్ దివాన్ విజయనగరం జిల్లా పార్వతీపురం కొత్త పోలమ్మ పురపాలక ఉన్నత పాఠశాలను సందర్శించారు. భోజనం ఎలా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
భోజనం రుచికరంగా వండడం లేదని విద్యార్థులు.. ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వారి తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డైరెక్టర్ విద్యార్థులకు సూచించారు. రుచికరమైన భోజనం తయారు చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఇదీ చదవండి: వంట సిబ్బందిని తొలగించడం అన్యాయం