ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో ఉప ముఖ్యమంత్రి పాముల పష్పశ్రీవాణి ప్రారంభించారు. మాస్కులు, శానిటైజర్లు ఉన్న కిట్లను వాలంటీర్లకు అందించారు. ఇంటింటికీ వెళ్లి వాటిని అందించాలని.. కరోనా వైరస్ గురించిన జాగ్రత్తలు చెప్పాలని ఆదేశించారు.
ఇవీ చదవండి.. రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు