కరోనా నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కాని విజయనగరంలో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపారాల నిర్వహణకు, నిత్యావసర సరకుల కొనుగోళ్లకు అవకాశం కల్పించటంతో మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. పీడబ్య్లూ మార్కెట్, గంటస్తంభం, పాత మున్సిపల్ ఆఫీసు, రైల్వేస్టేషన్ రోడ్డు, కంటోన్మెంట్, ఉల్లివీధి, బాలాజీ టైక్స్ టైల్స్ మార్కెట్ తదితర ప్రాంతాలతో పాటు.. నగరంలోని ప్రధాన రహదారులనూ ఇదే పరిస్థితి. కొనుగోలుదారులు కనీసం భౌతిక దూరం కూడా పాటించడం లేదు.
సాలూరులో...
జిల్లాలోని సాలూరు పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయినప్పటికీ... కొంత మంది యువకులు మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారు. అయితే సాలూరు పురపాలక అధికారులు మాస్కులు లేకుండా బయటికి తిరుగుతున్న యువకులకు గుంజీలు తీయిస్తున్నారు. మరోసారి మాస్కులు లేకుంటే తిరిగితే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: నిద్రలో ఉన్నా.. శాశ్వత నిద్రలో కాదు: పరేశ్ రావల్