విజయనగరం జిల్లా సాలూరు మండలం గుడ్డంగివానివలస గ్రామంలో రెడ్డి సన్యాసి అనే వ్యక్తి మరణించాడు. నిత్యం కడుపు నొప్పితో బాధపడుతుండేవాడని కుటుంబీకులు చెప్పారు. రాత్రి భోజనం చేయకుండా పడుకున్నాడని తెలిపారు. ఉదయం లేచి చూసే సరికి స్పృహ తప్పి పడి ఉన్న అతడిని చూసి భార్య కేకలు వేసింది.
గమనించిన కుమారుడు.. రెడ్డి సన్యాసి నోటి వెంట పురుగుల వాసనతో నురగలు గుర్తించాడు. వెంటనే సాలూరు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: