విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి డిగ్రీ కళాశాలను పురపాలిక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. కళాశాలలో ప్రస్తుతం స్థితిగతుల, కావాల్సిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బంది వివరాలను కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పందించిన కలెక్టర్ వెంకట్రావు అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర డిగ్రీ కళాశాలను కూడా పరిశీలించి అక్కడ అవసరమైన వస్తువులకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇక నుంచి హాస్టల్ సీట్లు కేటాయించేటప్పుడు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అవసరమైన నిధులు ఇస్తాం : బొత్స
చీపురుపల్లిలో కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకోసం గత ప్రభుత్వం హయాంలో ఇప్పటికే కేటాయించిన 7.9 ఎకరాల స్థలాన్ని గుర్తించి రూ.15 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించామని మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్యాంకుమార్ మంత్రికి వివరించారు. మార్కెట్ యార్డ్‌ను కొత్తగా నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.
క్రీడా వికాస ప్రాంగణ నిర్మాణానికి..
చీపురుపల్లిలో సుమారు రెండు కోట్ల వ్యయంతో 6 ఎకరాల విస్తీర్ణంతో క్రీడా వికాస ప్రాంగణం నిర్మాణానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా క్రీడా అధికారి రామకృష్ణను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.
ఇవీ చూడండి : Jagan Delhi Tour: దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ