విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. కొవిడ్ ప్రభావం తగ్గినప్పటికీ, వసతి గృహాలు తెరుచుకోకపోవటం.. బస్సుల సౌకర్యం లేకపోవటంతో విద్యార్థులు హాజరుకాలేకపోతున్నారు.
పార్వతీపురం పట్టణం, మండలంలో 40.. పంజాగుట్ట సీతానగరం మండలాల్లో 80 వరకు పాఠశాలలున్నాయి. వసతి గృహాలు తెరుచుకోకపోవటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు... అధిక ఛార్జీలు పెట్టుకొని తరగతులకు హాజరుకాలేకపోతున్నారు.
ఆర్టీసీ బస్సుల సేవలు గ్రామీణ ప్రాంతాల్లోకి రాకపోవటంతో... ఆటోలో వచ్చి వెళ్లేందుకు రోజుకి 100 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని విద్యార్థులు తెలిపారు. వసతి గృహాలు తెరిస్తే కొంతమేర ఆర్థిక భారం తగ్గుతుందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ కేసు వేసిన జనసేన నేతపై హత్యాయత్నం