ETV Bharat / state

నిల్చున్నచోటే కుప్పకూలి మృతి చెందిన లారీ డ్రైవర్ - vizianagaram district newsupdates

తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం లోడును విజయనగరం జిల్లా సాలూరు పెద మార్కెట్​కు తీసుకువచ్చారు. సరకు అన్​లోడ్ చేస్తుండగా లారీ డ్రైవర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడి మృతి చెందాడు.

lorry driver collapsed where he was standing
'లారీ డ్రైవర్ నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు'
author img

By

Published : Mar 7, 2021, 3:32 PM IST

తూర్పుగోదావరి జిల్లా నుంచి బియ్యం లోడును విజయనగరం జిల్లా సాలూరు పెదమార్కెట్​కు తీసుకువచ్చారు. సరకు అన్​లోడ్ అయితే తిరిగి సొంతూరుకు వెళ్లిపోయేవారు.. కానీ ఎమైందో ఏమో.. ఉన్నచోటే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. సామర్లకోటకు చెందిన లారీ డ్రైవర్​ ఏసబ్బాయి అధికారులు పట్టించుకోకపోవటంతో సుమారు 2 గంటల పాటు మృతదేహం అక్కడే ఉండిపోయింది.

ఎస్​ఐ ఫకృద్ధీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం నుంచి లారీలో బియ్యం లోడుతో డ్రైవర్, క్లీనర్ సాలూరు చేరుకున్నారు. అన్​లోడ్​ అయ్యేలోపు భోజనం చేసి రమ్మని క్లీనర్​ని పంపించాడు. తిరిగి వచ్చేసరికి పడిపోయి ఉన్నాడు. ఎందుకు పడిపోయాడోనని.. లేపే ప్రయత్నం చేయగా.. మృతి చెందినట్లు గుర్తించాడు. దీనిపై పట్టణ పోలీసులకు క్లీనర్ ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులకు ఫోన్​ ద్వారా సమాచారం అందించారు. మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ చెప్పారు.

ఇదీ చూడండి:

చివరి దశకు చేరుకున్న పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.