Lokesh Yuvagalam Navashakam Sabha Started: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం - నవశకం విజయోత్సవ సభ విజయనగరం జిల్లా పోలిపల్లిలో ప్రారంభమైంది. సభ ప్రాంగణానికి భారీగా తెలుగుదేశం, జనసేన శ్రేణులు, అభిమానులు చేరుకుంటున్నారు. ఇప్పటికే పోలపల్లి వద్ద రిసార్ట్స్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. కాసేపట్లో సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు.
Pawan Reached to Visakha: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుంచి పోలపల్లికి బయల్దేరారు. విశాఖ నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారి మొత్తం పసుపువర్ణంగా మారింది. తమ అభిమాన నాయకుల రాకను స్వాగతిస్తూ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి పోలిపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌ల భారీ కటౌట్లు దర్శనం ఇస్తున్నాయి.
నవశకం ప్రాంగణంలో పండుగ వాతావరణం - ఆకర్షణీయంగా నేతల భారీ కటౌట్లు
రాష్ట్ర స్థాయిలో కనీవిని ఎరుగని రీతిలో సభ: యువగళం విజయోత్సవ బహిరంగ సభకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హాజరయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో సభ జరుగుతోందని వర్ల రామయ్య సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ -జనసేన సాధించబోతుందనడానికి ఈ సభకు హాజరైన ప్రజలే నిదర్శనమన్నారు.
టీడీపీ-జనసేన ప్రభుత్వం ఖాయం: యువగళం విజయోత్సవ సభ చూసి తాడేపల్లిలో కూర్చున్న సీఎం జగన్ భయవడుతున్నారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి పట్టిన శని వదలించుకోబోతున్నామన్నారు.
రైతులు రారాజులు కాబోతున్నారని, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధిలోకి రాబోతున్నారని తెలిపారు. మహిళలు ధైర్యంగా రోడ్లపై తిరగే స్వేచ్ఛ, భద్రత 100రోజుల్లో రాబోతోందని వెల్లడించారు.
లక్షలాదిగా తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు - విజయోత్సవ సభలో ఏర్పాట్లపై ప్రశంసల జల్లు
జగన్ అరాచకపాలనతో ప్రజల ఆశయాలను ఆవిరి చేశారు: యువగళం కేవలం పాదయాత్రే కాదని, అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జైత్రయాత్ర అని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. జగన్ అరాచకపాలనతో 5కోట్ల ప్రజల ఆశలు, ఆశయాలను ఆవిరిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటున్న జగన్ ఆయా వర్గాలకు ఏం చేశాడో చెప్పాలని సవాల్ విసిరారు. బీసీలకు పెట్టిన కార్పొరేషన్లలో చైర్ పర్సన్లు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కార్పొరేషన్లను సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ధ్వజమెత్తారు.
'యువోహం!' లోకేశ్‌కు అడుగడుగునా జనహారతి - కలిసి అడుగేసిన కుటుంబ సభ్యులు