విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాస్ రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ అబ్కారీ సూపరింటెండెంట్ శ్రీనాథులు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా కాలనీ, పెద్ద రిల్లి వీధుల్లో తనిఖీలు చేపట్టగా 800 ప్యాకెట్ల నాటుసారాను గుర్తించారు.
వాటిని స్వాధీనం చేసుకుని 13 మందిని అరెస్ట్ చేశారు. ఆయా వీధుల్లోని 21 అనుమానిత ద్విచక్ర వాహనాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. సారా నియంత్రణకు పక్క ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: