ETV Bharat / state

గూడ్స్​ రైలు ఢీకొని మహిళ మృతి - vijayangaram district latest news

పార్వతీపురం పట్టణ రైల్వేస్టేషన్​ సమీపంలో గూడ్స్​ రైలు ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలంలో ఉన్న గ్యాంగ్​మ్యాన్​... స్టేషన్​ మాస్టర్​, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

lady hit by goods train and died in vijayanagaram district
గూడ్స్​ రైలు ఢీకొని రమణమ్మ మృతి
author img

By

Published : Jul 11, 2020, 10:20 AM IST

పార్వతీపురం రైల్వేస్టేషన్​ సమీపంలో గూడ్స్​ రైలు ఢీకొని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన గ్యాంగ్​మెన్​, స్టేషన్​ మాస్టర్​ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతురాలు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు గ్రామానికి చెందిన కర్రి రమణమ్మ(42)గా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆమె మతిస్థిమితం లేక రెండు రోజుల నుంచి స్టేషన్​ పరిధిలోనే తిరుగుతుండేదని రైల్వే పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అనకాపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి .. ఆందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.