ETV Bharat / state

Tennikoit sport: టెన్నికాయిట్‌ క్రీడల్లో జాతీయ స్థాయిలో కీర్తి పతకాలు ఎగురవేస్తున్న.. విజయనగరం అమ్మాయిలు

Tennikoit sport in AP: రెక్కాడితే గాని డొక్క నిండని నిరుపేద కుటుంబం నుంచి క్రీడల్లోకి ప్రవేశించారు ఆ అమ్మాయి లు. పాఠశాల స్థాయి నుంచే టెన్నీకాయిట్ క్రీడపై ఆసక్తి చూపి.. ప్రత్యేక శిక్షణ, పట్టుదలతో సాధన చేసి సత్తా చాటారు. పల్లె నుంచి జాతీయ స్థాయికి క్రీడాకారులుగా ఎదిగి పతకాల పంట పండిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలోనూ దేశానికి పతకాలు తెస్తామంటున్న ఆ యువ క్రీడారత్నాల కష్టాల వెనకున్న అసలు కథలపై ప్రత్యేక కథనం.

Tennikoit sport
Tennikoit sport
author img

By

Published : Jun 8, 2023, 3:24 PM IST

Updated : Jun 12, 2023, 3:41 PM IST

టెన్నికాయిట్‌ క్రీడల్లో రాణిస్తోన్న అమ్మాయిలు

Tennikoit sport in Vizianagaram district: విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ చిన్నగ్రామం కొండలక్ష్మీపురం. ఈ ఊరంతా పేద, మద్యతరగతి కుటుంబీకులే. అయితేనేం టెన్నీకాయిట్ క్రీడకు కేరాఫ్‌గా మారారు ఈ క్రీడాకారిణిలు. ఏ మాత్రం సౌకర్యాలు లేకపోయినా కోచ్‌ ప్రత్యేక శిక్షణ, గ్రామస్థుల సహాయ సహకారాలతో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్నారు ఈ మట్టిలో మాణిక్యాలు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు సాదిస్తున్నారు. టెన్నికాయిట్ క్రీడలో ప్రతిభ కనబరిచి స్వర్ణ, రజత, ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొనేందుకు ఎంపికైయ్యారు. ఈ పోటీల్లో పాల్గొని ఇండియాకు టెన్నికాయిట్ ఛాంపియన్ షిప్ అందించాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నట్లు చెబుతున్నారు.

డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పతివాడ రేణుక టెన్నీకాయిట్లో చక్కగా రాణిస్తోంది. ఆమె తండ్రి లక్ష్మనాయుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా, తల్లి సత్యవతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో వంట మనిషిగా పని చేస్తోంది. కుమార్తె ఆసక్తిని గుర్తించి తల్లితండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇదే పట్టుదలతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగి మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నదే లక్ష్యమంటోం ది రేణుక.

"సిలంభం"లో దూసుకెళ్తున్న క్రీడాకారులు.. జాతీయ స్థాయిలో మెరుపులు
టెన్నీకాయిట్లో జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన ఈ అమ్మాయి పేరు ముల్లు ప్రవల్లిక. తండ్రి శ్రీరాములు మోటారు సైకిల్‌ మెకానిక్‌గా ఉపాధి పొందుతున్నాడు. ఐనా కుమార్తె ఆసక్తిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్నాడు. డిగ్రీ చదువుతూనే పోటీల్లో రాణిస్తోందిప్రవల్లిక. రాజస్థాన్, ఛండీగఢ్‌, బెంగళూరు, దిల్లీ, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, కేరళలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 10 సార్లు పాల్గొని పతకాలు సాధించింది.

గుంటూరు టు ఫిల్మ్ ఎడిటర్ వయా అమెరికా.. తొలి మహిళా ఎడిటర్ సృజన అడుసుమిల్లి
గుంప శ్రావణి. గీత కార్మికుని బిడ్డ. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుంది. ఆమె క్రీడాసక్తి గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు కుటుంబం. ఫలితంగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తోంది. ఇప్పటి వరకు కేరళ, పంజాబ్, తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి టెన్నీకాయిట్ పోటీల్లో పాల్గొంది. క్రీడారంగంలో ప్రతిభ కనబరిచి... ఉన్నతంగా స్థిరపడి... తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలన్నదే లక్ష్యంగా చెబుతోంది శ్రావణి.

Para Badminton: విధిరాతను ఎదిరించి.. పారా బ్యాడ్మింటన్‌లో సత్తా చాటుతున్న శ్రీకాకుళం యువతి

'వీరి ప్రతిభ, నైపుణ్యాలు... నేర్చుకోవాలనే పట్టుదలకు తల్లిదండ్రుల చొరవ, ప్రోద్బలం తోడవ్వటంతో ఇది సాధ్యమైంది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ఈ మట్టిలో మాణిక్యాల చీపురుపల్లి అగ్నిమాపక స్టేషన్ ఆవరణలో ఈ క్రీడాకారిణిలకు ప్రత్యేక శిక్షణ కోసం పలు వసతులు కల్పించాం.'- హేమసుందర్, చీపురుపల్లి అగ్నిమాపక కేంద్రం ఎస్.ఐ

పట్టుదల,ఆత్మవిశ్వాసంతో ఈ మట్టిలో మాణిక్యాలు చక్కటి క్రీడా స్ఫూర్తి కనబరుస్తున్నారు. జాతీయ,అంతర్జాతీయ స్థాయి టెన్నికాయిట్‌ పోటీల్లో సత్తాచాటుతూ అందరిని ఔరా అనిపిస్తున్నారు. వీరి స్ఫూర్తితో కొండలక్ష్మీపురంలో మరికొందరు బాలికలు టెన్నీకాయిట్ క్రీడ వైపు అడుగులు వేయటం హర్షణీయం అంటున్నారు స్థానికులు.

Last Updated : Jun 12, 2023, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.