ETV Bharat / state

Crop insurance: పంట పోయింది..అయినా అందని పరిహారం - ఈ-క్రాప్ వార్తలు

విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా పథకం(crop insurance scheme) పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. వాస్తవంగా పంట నష్టపోయిన వేలాది మంది రైతులు... పరిహారానికి నోచుకోలేదు. అన్ని అర్హతులున్నప్పటికీ..క్షేత్రస్ధాయి సిబ్బంది నిర్లక్ష్యం, సాగు చేసిన పంట ఈ-క్రాప్‌లో నమోదు కాకపోవడంతో... బీమా పరిహారాన్ని అందుకోలేకపోతున్నామంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kharif crop insurance scheme
ఖరీఫ్ పంటల బీమా పథకం
author img

By

Published : May 28, 2021, 9:37 AM IST

గత ఖరీఫ్ సీజన్‌లో.. వరి, వేరుశనగ, అరటి పంటలకు... రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో.. 16వేల 701 మంది వరి రైతులు, 283మంది వేరుశనగ, 6వేల378మంది అరటి రైతులు ఖరీఫ్ పంటల బీమాకు అర్హ్హత సాధించారు. మొత్తం 2 లక్షల 36వేల 968మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదు కాగా... ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం అందించిన పంటల బీమా పథకం ద్వారా కేవలం 23 వేల 332మంది రైతులు 32.49కోట్ల రూపాయల లబ్ధి పొందారు. దీని ప్రకారం ఇంకా 2 లక్షల 13వేల 636 మంది బీమా పరిహారానికి నోచుకోలేదు. ఈ-క్రాప్ నమోదులో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తప్పిందాల వల్లే తాము బీమాకు దూరమయ్యామంటూ రైతులు వాపోతున్నారు.

అమలుకాని ఖరీఫ్ పంటల బీమా పథకం

విజయనగరం జిల్లాలో సుమారు 17వేల మంది కౌలుదార్లు ఉన్నారు. పంటల సాగు పెట్టుబడులకూ వేలాది రూపాయలు వెచ్చించారు. అయితే ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి పంట కీలక దశ వరకు వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో.... కౌలు డబ్బులతో పాటు పెట్టుబడులు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఖరీఫ్ పంటల బీమా కింద పైసా కూడా రాకపోవటంపై రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ-క్రాప్‌ నమోదులో క్షేత్రస్థాయి సిబ్బంది తప్పులను సరిదిద్ది రైతులకు బీమా అందించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఖరీఫ్‌ పంటల బీమా పరిహారం విషయంలో... పంటల కోత ప్రయోగాల్లో గత ఐదు సంవత్సరాల దిగుబడి సగటు శాతాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. లక్ష రూపాయలు దాటిన 3వేల 226 మంది రైతులకు... దశల వారీగా బీమా సొమ్ము విడుదల చేస్తామని తెలిపారు.

వర్షాభావ పరిస్థితుల్లో పెట్టుబడులు పూర్తిగా కోల్పోయి.. భరోసా ఇస్తుందనుకున్న పంట బీమా పథకం మొండిచెయి చూపటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి బీమా సొమ్ము విడుదల చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

నైరుతి రుతుపవనాల ఆగమనం : రాగల 3 రోజులూ మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.