రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైన కనిపించటం లేదని తెదేపా ముఖ్యనేత కళా వెంకట్రావ్ ఆరోపించారు. విజయనగరంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు నివాసంలో.. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా సమావేశం జరిగింది. స్థానిక సంస్థల బలోపేతం, రైతుల సమస్యలపై పోరాటం, నూతన జిల్లాల ప్రతిపాదనపై తెదేపా నేతలు సమీక్షించారు. ప్రభుత్వ తీరుతో పేదలు.. నిరుపేదలుగా మారుతున్నారని కళా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు విమర్శించారు. ఈ సమావేశంలో విజయనగరం తెదేపా నాయకుడు ఐవీపీ రాజుని.. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు