ETV Bharat / state

జిందాల్​ పరిశ్రమ వద్ద కార్మికుల ధర్నా

తిమ్మలపాలెం వద్దనున్న జిందాల్​ పరిశ్రమను తెరవాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్​ చేశాయి. కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు చక్కబడినా... ఇంకా పరిశ్రమను మూసివేయడం ఏంటని ప్రశ్నించారు.

jindal workers protest to open the industry
పరిశ్రమను తెరవాలని జిందాల్​ కార్మికుల ధర్నా
author img

By

Published : Oct 8, 2020, 6:39 PM IST

కొత్తవలస మండలం తిమ్మలపాలెం వద్ద ఉన్న జిందాల్​ పరిశ్రమను వెంటనే తెరవాలని... కార్మికులు నిరసన చేపట్టారు. మూసివేసిన కాలానికి లే- ఆఫ్​ ఇవ్వాలని కోరారు. ఈ ధర్నాను కార్మికుల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కర్మాగారాన్ని మూసేశారని తెలిపారు.

పరిస్థితులు చక్కబడినా... కార్యకలాపాలు ప్రారంభించకపోవడం వల్ల కార్మికులు నిరసనకు దిగారు. పరిశ్రమ తెరవకపోవడం వల్ల వందలాది మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. త్వరగా కార్యకలాపాలు ప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరారు.

ఇదీ చదవండి:

'వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.