ETV Bharat / state

దశాబ్దాల కల... నూతన విధానంతో తీరేనా..? - bobbili latest news

ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడకు నూతనోత్తేజం రానుంది. ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రానున్నారు. ఫలితంగా యువతకు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Industrial park changes with news industrial  Policy
బొబ్బిలి పారిశ్రామిక పార్క్
author img

By

Published : Aug 17, 2020, 11:49 AM IST

విజయనగరం జిల్లా బొబ్బిలిలో 30 సంవత్సరాల క్రితం పారిశ్రామిక వాడ ఏర్పాటైంది. సుమారు 1150 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించారు. పారిశ్రామిక వాడను 1,087 ప్లాట్లుగా విభజించి 350 యూనిట్లకు స్థలాలు కేటాయించారు. కాగా.. స్థలాల కేటాయింపు పూర్తయినప్పటికీ పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఫలితంగా ప్రభుత్వం తీసుకున్న నూతన పారిశ్రామిక విధానం నిర్ణయంతో స్థలాలు తీసుకున్న వారంతా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

స్టాంప్ డ్యూటీ, విద్యుత్ సరఫరాలో రాయితీ, ఎస్సీ, ఎస్టీ ,బీసీ మహిళలకు స్థలాల కేటాయింపులో 50% మినహాయింపుతో మహిళకు స్థలాలు కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంతో పారిశ్రామికవాడ పరిశ్రమతో కళకళలాడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

ఇదీచదవండి.

గోదావరి ఉద్ధృతి.. అధికారులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.