ETV Bharat / state

పందిరి సాగుతో చీడపీడలకు చెక్​.. దిగుబడులు అధికం! - విజయనగరంలో అధిక దిగుబడులనిస్తున్న పందిరి సాగు

కాకర, ఆనప వంటి పంటలు ఎక్కడ పండిస్తారు అంటే.. తడుముకోకుండా వచ్చే సమాధానం 'నేల మీద'. అందుకు భిన్నంగా ఆలోచించి.. వెదురు బొంగులు, జీ వైరుతో పందిరి సేద్యం ప్రారంభించాడు చౌదరి అనే రైతు. లక్షకుపైగా ఖర్చుపెట్టినా.. దిగుబడి బాగుందని ఆనందం వ్యక్తం చేశాడు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే.. ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగితో సమానంగా రైతు సంపాదించవచ్చంటున్నాడీ రైతు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భంకు చెందిన ఈ వ్యవసాయదారుడు.. ఇతర అన్నదాతల అభివృద్ధికీ సలహాలు ఇస్తున్నాడు.

pandiri cultivation
పందిరి సాగుతో కూరగాయలను పండిస్తున్న రైతు
author img

By

Published : Nov 24, 2020, 10:02 PM IST

పందిరి సాగు

అందరిలా కాకుండా ప్రయోగాత్మకంగా సాగు చేయడం మొదలుపెట్టాడు.. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భంకు చెందిన రైతు చౌదరి. చీడ, పీడల బెడదతో.. నేలపై పండించే పంటలకు నాణ్యత రాదని గుర్తించాడు. ప్రత్యేక పద్ధతిలో సేద్యం చేయాలని ఆలోచించాడు. రెండెకరాల పొలం కౌలుకు తీసుకుని.. పందిరి సాగు మొదలు పెట్టాడు.

పందిరి ఇలా...

తోటి రైతులు, మిత్రులతో చర్చించి.. పందిరి సాగుకు అనువైన వెదురు బొంగులను ఎంచుకొన్నట్లు చౌదరి తెలిపాడు. గర్భం దగ్గరలోని భద్రవలస నుంచి కావలసిన కర్రలను తెప్పించి.. నిర్దిష్ట పొడవు, వెడల్పుల్లో ఉండే విధంగా సిద్ధం చేశానన్నాడు. జీ వైరు, వెదురు బొంగులు సహాయంతో పందిరి పూర్తి చేసినట్లు వెల్లడించాడు.

కాకర సాగు విధానం:

మొదట ఒక ఎకరంలో ప్రయోగాత్మకంగా కాకర పంట వేశాడు. విత్తనం అరకిలో అవసరమైనట్లు అతడు తెలిపాడు. నాటడానికి ముందు దుక్కిలో డీఏపీ కలిపినట్లు వెల్లడించాడు. మొక్క మొలిచిన 25 రోజుల తర్వాత మరోమారు డీఏపీ వేసి నీరు పెట్టినట్టు పేర్కొన్నాడు. ఆ తర్వాత 28-28 ఎరువులు, పొటాస్ కలిపి ఇచ్చానన్నాడు. గాలి, వెలుతురు మొక్కలకు ఎక్కువగా తగిలే విధంగా సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ కారణంగా పంటకు పెద్దగా తెగుళ్లు సోకలేదని అభిప్రాయపడ్డాడు. క్వినాల్ ఫాస్, క్లోరిపైరిఫాస్ 85 పౌడర్ తయారు చేసి.. 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేశానన్నాడు.

సొరకాయ సాగులోనూ...

అర ఎకరంలో ఆనప కాయను సాగు చేస్తున్నట్లు రైతు తెలిపాడు. ఈ పంటకూ అవే వెదురు బొంగులు, జీ వైర్ ఉపయోగిస్తున్నట్లు వివరించాడు. రాశి సంస్థకు చెందిన వరుణ్​ విత్తనాలకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ రకం విత్తనాలు.. చీడ, పీడలను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తాయని పేర్కొన్నాడు. మార్కెట్లో ఒక్కో కాయ రూ. 18 నుంచి 20 వరకు పలుకుతోందని ఆనందం వ్యక్తం చేశాడు.

పంట దిగుబడి, నాణ్యత:

మార్కెట్​లో తమ కాయలు అయ్యాకే ఇతర రైతుల వద్ద వ్యాపారులు కొనుగోలు చేస్తారని చౌదరి చెప్తున్నాడు. నాణ్యమైన కూరగాయలు అందిస్తున్నందుకే.. తమపై నమ్మకం పెంచుకున్నట్లు వివరించాడు.

"ప్రస్తుతం ఆరవ విడత కాకర కోస్తున్నాము. ఎకరాకు మొదటిసారి 300 కిలోలు దిగుబడి రాగా.. ప్రస్తుతం 1100 కిలోల వరకు రావచ్చు. కాకర ధర ఇప్పుడు కిలో 25 నుంచి 35 మధ్యలో ఉంది. మొదటి ఏడాది పెద్దగా లాభాలు ఆశించక పోయినా.. పంట ఆశాజనకంగా ఉంది. ఆ తర్వాత నుంచి సంవత్సరాల తరబడి ఇదే విధంగా ముందుకు సాగుతున్నాం". - చౌదరి, రైతు.

సస్యరక్షణే శ్రీరామరక్ష:

పంటను చిన్న పిల్లలా పరిగణించి జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని చౌదరి సూచిస్తున్నాడు. తాను పండించే పొలాన్ని చూడటానికి చుట్టుపక్కల రైతులూ రావడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నాడు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి.. వారి అభివృద్ధికి దోహదపడుతున్నట్లు పేర్కొన్నాడు. సరైన పద్ధతిలో వ్యవసాయం చేస్తే.. రైతు సంపాదన ముందు సాఫ్ట్​వేర్ ఉద్యోగి వేతనం తక్కువేనని ధీమా వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

'నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీ పై చర్యలు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.