మాసిన గడ్డంతో, నెరిసిన జుట్టుతో రోడ్ల పక్కన అనేక మంది యాచకులు పలు ప్రాంతాల్లో నిత్యం దర్శనమిస్తూనే ఉంటారు. వారికి ఎంతో కొంత సాయం చేసే వాళ్లు కొందరుండగా.. పట్టించుకోని వారెందరో. 'మానవసేవే మాధవ సేవ' అంటూ మానవత్వాన్ని చాటుతోంది.. 'హెల్పింగ్ హాండ్స్' సంస్థ.
సేవా తత్పరత
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రోడ్ల వెంటనున్న బిచ్చగాళ్లకు కటింగ్, షేవింగ్ చేయించారు.. 'హెల్పింగ్ హాండ్స్' ప్రతినిధులు. వారికి మంచి వస్త్రాలు అందించి, భోజనం పెట్టారు. దుమ్ము, ధూళితో సహవాసం చేసే అభాగ్యులకు శుభ్రత నేర్పించారు.
ఆంధ్ర టూ కర్ణాటక
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాము సేవలు అందిస్తున్నామని 'హెల్పింగ్ హాండ్స్' సభ్యులు పేర్కొన్నారు. ఆంధ్ర మాత్రమే కాక.. కర్ణాటకలోని బెంగుళూరు వరకు సేవా తత్పరతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తమ ఆశయాల్లో భాగంగానే చీపురుపల్లిలో ఈ పనికి పూనుకొన్నామన్నారు.
సమాచారం అందిచండి
ఈ తరహా దయనీయ స్థితిలో ఎవరైనా బిచ్చగాళ్లు ఉన్నారని తెలిస్తే.. తమకు సమాచారం అందించాలని సంస్థ ప్రతినిధులు కోరారు. సాధ్యమైనంత వరకు తమ కార్యక్రమాలను విస్తరిస్తూ పోవడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: