విజయనగరం జిల్లా సీతానగరంలో సువర్ణముఖి నది వంతెనపై భారీ వాహనం నిలిచిపోవటంతో ట్రాఫిక్ స్తంభించింది. లారీపై తరలిస్తున్న వరికోత యంత్రం వంతెన వద్ద ఇరుక్కుపోయింది. పార్వతీపురం, బొబ్బిలి వైపు నుంచి వచ్చే వాహనాలు స్తంభించిపోయాయి. పార్వతీపురం, విశాఖపట్నం ప్రధాన రహదారి కావటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: