వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా ఉరుములు, మెరుపులతో కురిసిన వానకు రోడ్లున్నీ జలమయమయ్యాయి. మరికొన్నిచోట్ల కాలనీలు నీట మునిగాయి. మరోపక్క వర్షాలు పడటంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం చల్లబడి ఎండ, వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంపై ఉంటుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
rains: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్